మధురానుభూతులు
 
 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

  కళలు అంటే ఇష్టపడే వ్యక్తి, స్వయానా కళాకారులు, రాజకీయ నాయకులు స్వర్గీయ శ్రీ కోన ప్రభాకర రావు గారి దృష్టి శివప్రసాద్ మీద పడటం అదృష్టం. అప్పటి ప్రధాని స్వర్గీయ శ్రీమతి ఇందిరా గాంధీకి ఇటువంటి ఒక కళాకారుడు మన దేశంలో ఉన్నాడని ఆ రోజుల్లోనే ప్రభాకరరావు గారు పరిచయం చేసి ఆశీర్వదింపచేశారు. అంతే కాకుండా ఆయన ముగ్గురు మహా విద్వాంసులకి శివప్రసాద్ ని పరిచయం చేశారు. వారు డా||బాలమురళీ కృష్ణ, ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్, వేణువు విద్వాంసులు శ్రీ ఎన్.ఎస్. శ్రీనివాసన్.

భగవంతుడు శివప్రసాద్ కు మరణంలేని తల్లిదండ్రులను ఇచ్చారని వారే శ్రుతి, లయలని వాగ్గేయ కారులు సంగీత కళానిధి, పద్మవిభూషణ్ డా||మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారొక సభలో అన్నారు.

20 సంవత్సరాల క్రితమే బాల మురళీ కృష్ణ శివప్రసాద్ కు తన వద్ద్ ఉంచుకుని సంగీతంలోని మెళుకువలను నేర్పించారు.

భగవాన్ సత్య సాయి బాబా పుట్టపర్తిలో శివప్రసాద్ కచ్చేరి విని సంతోషించి నువ్వు చేస్తున్నది అద్భుత ప్రక్రియ మహా అద్భుతం అని బంగారు గొలుసుతో, పట్టువస్త్రాలతో ఘనంగా సన్మానించారు.

ఏ కళాకారుడికైనా తన ప్రతిభ పది మంది సంతోషానికి ఉపయోగపడాలని కోరుకుంటాడు. శివప్రసాద్ కు పైన ఉదహరించినవే కాక ఇంకా మరెన్నో మధురానుభూతులున్నాయి.

 
   
 


Copyright 2005-2013 Whistlewizard.com. All rights reserved  
                                                                                                                                                        Design: Agnatech